
బోర్డు ఒకటి.. దందా మరోటి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఈ గుడిసెను చూసి కూరగాయలు విక్రయాలు చేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే.. లైసెన్స్ పొంది నిర్వహించే బార్ అండ్ రెస్టారెంట్‌ను తలపించేలా మద్యం, మాంసంతోపాటు బిర్యానీ ఇతర తినుబండారాలన్నీ ఈ గుడిసెలోనే లభిస్తాయన్నది నగ్నసత్యం. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో ఇక్కడ మద్యం సీసాలకు రెక్కలొచ్చాయి. నిర్వాహకులు చెప్పినంత ఇస్తేనే.. మద్యం దొరుకుతుండడడంతో గత్యంతరంలేక కొనుగోలు చేస్తున్నామని మద్యం ప్రియులు వాపోతున్నారు. దీని నిర్వాహకులు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వారిబంధుగణమే కావడం గమనార్హం. ప్రతినెలా అడిగినంత నజరానా ఇస్తుండడమే కారణమని పట్టణంలో చర్చించుకుంటున్నారు. వీరిని చూసి మినీట్యాంక్ బండ్ పరిసరాల్లో రోజుకో బెల్ట్‌షాపు పుట్టుకొస్తోందని, ఇప్పటికే చిన్నచిన్నవి ఏడెనిమిది మద్యం అమ్మకాలు సాగించే దుకాణాలు వెలిశాయంటున్నారు. ఎక్కడ మద్యం దొరక్క పోయినా.. ఏ సమయంలో వచ్చినా మినీట్యాంక్ బండ్ వద్ద మద్యం దొరుకుతుండడంతో ఈప్రాంతం నిత్యం మద్యం మత్తులో ఉన్నవాళ్లే కనిపిస్తుంటారు. ఏదైనా అవసరం నిమిత్తం రావాలంటే భయమేస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా పోలీసు, ఎకై ్సజ్ తదితర శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.