బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
రామగిరి(మంథని): జనాభా ప్రాతిపదికన రాజకీయ, విద్య, ఉద్యో గ రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాల ని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీ య అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకొలుపు రథయాత్ర ఆదివారం సెంటినరీకాలనీకి చేరింది. ఈసందర్భంగా మార్కెట్ చౌరస్తాలోని అంబేడ్కర్, పూలే, రాణీరుద్రమదేవి స్టేడియం ఎదుట గల తెలంగాణ అమరవీరుల స్తూపం వ ద్ద నివాళి అర్పించారు. అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బి ల్లు అమలు చేయాలన్నారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంథనిలో బీసీల అణచివేతకు మంత్రి కుటుంబం ప్రధాన కారణ మని ఆరోపించారు. అనేకమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మంత్రి సతీమణి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేనేత శాఖలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, నాయకులు కుమార్ యాదవ్, శంకర్‌లాల్, గౌతం శంకరయ్య, రాజసంపత్, ఆసం తిరుపతి, సైండ్ల సత్యనారాయణ, గద్దల శంకర్, మల్యాల మోహన్, కొండవేన ప్రభాకర్, నూనె రాజేశం, బొంకూరి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


