
కటింగ్‌లకు కాలం చెల్లింది
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదె ల: ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. ధాన్యం దోపిడీ ఆ గింది.. గత ప్రభుత్వాలు ధాన్యం బస్తాల తూకంలో మోసం, కటింగ్‌లు చేశాయి.. ఇప్పుడు వాటికి కా లం చెల్లింది’ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లె, మడిపెల్లికాలనీ, పాతమడిపెల్లి, ఆశన్నపల్లె, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్‌లో ఆదివారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, కొత్తపల్లిలో క్రికెట్ పోటీల కు హాజరయ్యారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు తానిపర్తి కాంతారావు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఓదెల మండలం కొలనూర్‌లో మహనీయుల జయంతిలో పా ల్గొన్నారు. సుల్తానాబాద్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ పాలనలో చి‘వరి’ భూములకూ సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.