‘ఖని’ బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్ష, కార్యదర్శులుగా టి.సతీశ్, ఎస్.సంజయ్‌కుమార్ ఎన్నిక
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శిగా సిరిగ సంజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 207మంది ఓటర్లలో 199 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి పోటీపడిన తౌటం సతీశ్‌కు 71 ఓట్లు, బల్మూరి అమరేందర్‌రావుకు 59 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా పోటీచేసిన దేశెట్టి అంజయ్యకు 100 ఓట్లు రాగా, బోడ సమ్మయ్యకు 61 ఓట్లు వచ్చాయి. దీంతో అంజయ్య గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా ముచ్చకుర్తి కుమార్, కోశాధికారిగా ఎండీ ఉమర్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా ఎ.ప్రదీప్‌కుమార్, సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా పంగ శంకర్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, అనిల్‌కుమార్ తెలిపారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.


