● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యౖ మెన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షయ శిబిరం, ఎన్‌సీడీ సర్వే చాలాబాగా చేశారని వైద్యసిబ్బందిని అభినందించారు. టీబీ రహిత గ్రామాలను ప్రకటించాలని కలెక్టర్ సూచించారు. జి ల్లాలో గుర్తించిన బీపీ, మధుమేహం బాధితులు తమ జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పు ల గురించి ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల ద్వారా ఏ ప్రిల్‌లో అవగాహన కల్పించాలని అన్నారు. డ యాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీ క్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో జిల్లా ముందు వరుసలో ఉందని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
జిల్లాలో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌ఆర్‌యూపీలో జరిగిన పొరపాట్ల సవరణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాలపై కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు సురేశ్, గంగయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.