చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు చివరి ప్రయత్నంగా ఎత్తిపోతల పథకానికి ఉన్న ఎయిర్ వాల్వ్‌లకు పైపులు బిగించుకుని సాగునీరు అందిస్తున్నారు. అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌వాసుల దాహం తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వేమునూర్ పంప్‌హౌస్ నుంచి భూగర్భ పైపులైన్ నిర్మించింది. వీటికి రెండు విద్యుత్ మోటార్లు బిగించింది. ఎల్లంపల్లి నీటిని వీటి ద్వారా నందిమేడారం చెరువులోకి ఎత్తిపోసింది. ప్రస్తుతం ఎస్సారెస్సీ నీరు అందక ఎండుతున్న పంటలకు ఎయిర్‌వాల్వ్‌లు జీవం పోస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు, జయ్యారం, మద్దిర్యాల తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లోని వరి పంటను ఎయిర్‌వాల్వ్ వృథా నీరు ఆదుకుంటోంది. ఇలా నీటిని తరలించడం తప్పని తెలిసినా తప్పక చేస్తున్నామని కొందరు రైతులు తెలిపారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
తప్పని తెలిసినా.. తప్పట్లేదు..
తప్పని తెలిసినా.. తప్పట్లేదు..