ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలో ఇసుక, మ ట్టి అక్రమంగా తరలిపోతోంది. మానేరు సరి హద్దు గుట్ట, ప్రభుత్వ భూమిలో ఎర్రమట్టితోపాటు ఇసుక రవాణా చేస్తున్నారు. దీనిపై ఫి ర్యాదు చేసినా.. మైనింగ్, రెవెన్యూ అధికారు లు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలోంచి మట్టి తీస్తే అనుమ తి కావాలంటున్న అధికారులు.. అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మధూ సూదన్‌రెడ్డిని వివరణ కోరగా, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, అక్రమార్కులపై చర్యల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
సీఎంవోగా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారు
● సింగరేణి సీఎండీ బలరాం
గోదావరిఖని: సింగరేణి సంస్థ చీఫ్ మెడి కల్ ఆఫీసర్‌గా కంపె నీ వైద్యాధికారే కొనసాగుతారని ఆ సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం పేర్కొన్నా రు. మంగళవారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులుతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణి వైద్యాధికారులు ఎలాంటి అపోహ లు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఆకాంక్షను సాకారం చేసేక్రమంలో విలువైన సలహాలు, సూచనలు అందించే బాధ్యతలను మాత్రమే చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్)గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని అన్ని ఏరియాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సీఎంఎస్ కృషి చేస్తారని ఆయన వివరించారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి
చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందప డి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీ పూర్‌తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్‌కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికు లు 108 అంబులెన్స్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు.
ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రాణా లు కోల్పోయాడు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదా నికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యుల కు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇసుక, మట్టి అక్రమ రవాణా
ఇసుక, మట్టి అక్రమ రవాణా