మందుబాబులపై కొరడా
గోదావరిఖని: న్యూఇయర్ సంబరాల్లో పీకల్లాగా తాగారు.. పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుపోయారు. నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలని పోలీసుశాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. అయినా హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. మద్యం తాగి రోడ్లపై హల్‌చల్ చేశారు. అదేస్థాయిలో పోలీసులు కూడా డ్రంకెన్ డ్రైవర్లను కట్టడి చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1న వేకువజాము వరకు విస్తృత తనిఖీలు కొనసాగాయి. ట్రాఫిక్, స్పెషల్ పార్టీ, లా అండ్ ఆర్డర్, మహిళా పోలీసులు అడుగడుగునా మోహరించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కొరడా ఝుళిపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో న్యూఇయర్ వేడుకల ఒక్కరోజులోనే రూ.7.52లక్షల ఫైన్‌లు విధించారు.
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై వేటు
స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం తాగి నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్ చేయడం, జరిమానాలు విధించారు. చట్టపరమైన కఠినచర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారి గుర్తించి కేసులు నమోదు చేశారు.
ప్రత్యేక బృందాల తనిఖీలు
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పెట్రోలింగ్, పికెట్స్, మఫ్టీ టీమ్స్, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాల ద్వారా నిఘాతో వాహనదారులకు ఫైన్‌లు వేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు
241 డ్రంకెన్ డ్రైవ్.. 2,365 ఈ చలాన్ కేసులు
రూ.7.50 లక్షల ఫైన్
బుక్‌అయిన ఈచలాన్ 2,365
డ్రంకెన్ డ్రైవ్ 241
గుర్తించిన వాహనాలు 241
జరిమానా రూ.7,52,010
న్యూఇయర్ వేడుకల్లో..


