అందుబాటులో సరిపడా యూరియా
పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు చేపట్టిన పంటల సాగుకు 8,226 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయాధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం 15,812 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, మిగతా నిల్వలు దశలవారీగా చేరుకుంటాయని పేర్కొంటున్నారు. రైతులు తమ ఇంటి నుంచే ఫర్టిలైజర్ బుకింగ్‌యాప్‌లో బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
‘జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న పంటలకు సరిపడా యూరియా నిల్వలున్నాయి. యూరియా కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దు. రైతుల అవసరాలకనుగుణంగా దశల వారీగా యూరియా అందిస్తాం. రైతులెవరూ ఆందోళన పడొద్దని ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.’
సాంకేతిక లోపంతో సమస్యలు
యూరియా బుకింగ్ యాప్‌పై రైతులు, వ్యాపారులకు అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారయంత్రాంగం విఫలమైంది. చాలా మంది రైతులకు యాప్ డౌన్‌లోడ్ చేసే విధానంపై అవగాహన లేనట్టు కనబడుతోంది. యాప్‌లో బుకింగ్ చేసుకున్న రైతు మొౖబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు చెబితేనే యూరియా డెలివరీ అవుతుంది. అయితే, ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతుండడంతో ఓటీపీ అనగానే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారిలో నెలకొన్న భయాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు అధికారయంత్రాంగం, గ్రామాలు, క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ప్రస్తుతం 15,812 మెట్రిక్‌టన్నుల యూరి యా అందుబాటులో ఉంది. యాప్‌లో బుకింగ్ చే సుకునే రైతులు తమకు సౌలభ్యంగా ఉన్న దుకా ణాలను ఎంపిక చేసుకుంటే అక్కడికి వెళ్లి యూరి యా పొందవచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నా యి. జిల్లాలోని సింగిల్‌విండోలు, డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పీవో)లలో నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు.
జిల్లాలో..
పంటల సాగు విస్తీర్ణం 2,11,328(ఎకరాలు)
వరి 1,95,712
మొక్కజొన్న 15,080
ఇతర పంటలు 536
అవసరమయ్యే యూరియా 38,226 మెట్రిక్ టన్నులు
ప్రస్తుత నిల్వలు 15,812 మెట్రిక్ టన్నులు
ఇంకా రావాల్సింది 22,414 మెట్రిక్ టన్నులు
15,812 మెట్రిక్‌టన్నులు..
ఇంటి నుంచే ‘యాప్’లో బుకింగ్
అందుబాటులో సరిపడా యూరియా


