పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు | - | Sakshi
Sakshi News home page

పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు

Mar 19 2025 12:53 AM | Updated on Mar 19 2025 12:48 AM

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్ర ప్రజలు అధికారం అప్పగిస్తే పాలించడం చేతకాక ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చందర్‌ విమర్శించారు. గోదావరి గోసపై చేపట్టిన పాదయాత్ర మంగళవారం రెండో రోజు పట్టణ శివారు బందంపల్లి నుంచి బయలుదేరింది. ఆయా ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు యాత్ర కు స్వాగతం పలికారు. ప్రగతినగర్‌ కూడలివద్ద తె లంగాణతల్లికి, బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయ కులు ఉప్పు రాజ్‌కుమార్‌, గంట రాములు, రఘువీర్‌సింగ్‌, రవీందర్‌, పెంట రాజేశ్‌, దాసరి ఉష, గండు రంగయ్య, జుబేర్‌, నటరాజ్‌, చంద్రశేఖర్‌, వైద శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై అసత్య ప్రచారం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని కాంగ్రెస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ విమర్శించారు. సుగ్లాంపల్లికి చేరుకున్న పా దయాత్రకు మాజీ కౌన్సిలర్‌ పసేడ్ల మమత మంగ ళహారతితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చందర్‌ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరమంటే చిన్న ఆనకట్ట కాదని, మూడు బరాజ్‌ లు, 15 రిజర్వాయర్లు, 19సబ్‌ స్టేషన్లు, 21పంపు హౌస్‌లు, 200 కి.మీ. సొరంగాలు, 1,530 కి.మీ. గ్రావిటీ కాలువలతో కూడుకున్నదని వివరించారు. నాయకులు దాసరి ఉష, రఘువీర్‌ సింగ్‌, పొన్నమనేని బాలాజీరావు, పాలరామారావు, పారుపల్లి గుణపతి, సూర శ్యామ్‌, సందీప్‌రావు, బుర్రశ్రీనివాస్‌ గౌడ్‌, దీకొండ భూమేశ్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌

రెండోరోజు కొనసాగిన ‘గోదావరి గోస’ పాదయాత్ర

పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు 1
1/1

పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement