వేతనాల కోసం ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం ఫిర్యాదు

Mar 17 2025 10:50 AM | Updated on Mar 17 2025 10:43 AM

గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు రెండు నెలల వేతనాలు చెల్లించలేదని పలువు రు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆదివా రం కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. సీహెచ్‌పీలో థర్డ్‌పార్టీ కోల్‌ షాంప్లింగ్‌ మజ్దూర్‌ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103మందికి గతేడాది ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన వేతనాలను సబ్‌కాంట్రాక్టు సంస్థ కేసీఎస్‌ ఇంకా చెల్లించలేదన్నారు. ప్రధాన కాంట్రాక్టు పొందిన ఈపీటీఆర్‌ కంపెనీ అధికారులను సంప్రదించినా స్పందించకపోవడంతో సింగరేణి దృష్టికి తీసుకుకెళ్లామన్నారు. అయి నా వేతనాలు అందలేదన్నారు. వెంటనే వేత నాలు చెల్లించేలా చూడాలన్నారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. నాయకులు కర్రె సంజీవరెడ్డి, కందుల సంధ్యారాణి, గుండబోయిన భూమయ్య, మి ట్టపల్లి సతీశ్‌, కోడూరి రమేశ్‌ పాల్గొన్నారు.

స్విమ్మింగ్‌పూల్‌ ప్రారంభం

గోదావరిఖని: నిమ్‌లో ఆధునికీకరించిన ిస్వి మ్మింగ్‌ పూల్‌ను జీఎం వెంకటయ్య ఆదివారం ప్రారంభించారు. నిమ్‌లో శిక్షణకు వచ్చే అధికా రులు, కాలనీలోని అధికారులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకొనేలా స్విమ్మింగ్‌పూల్‌ను తీర్చిదిద్దినట్లు జీఎం తెలిపారు. ప్రాజెక్ట్‌ అధికారి మధుసూదన్‌, వకీల్‌పల్లిగని ఏజెంట్‌ నెహ్రూ, ఏరియా ఇంజినీర్‌ నరసింహారావ్‌, వర్క్‌షాప్‌ ఏజీఎం ఎర్రన్న పాల్గొన్నారు.

లక్ష్యం సాధించిన ఓసీపీ –5

గోదావరిఖని: అధికారులు, కార్మికులు సమష్టి గా శ్రమించారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 16 రోజుల ముందుగానే సాధించారు.. జీడీకే–5 ఓసీపీకి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఈనెల 15వ తేదీతోనే 36.19లక్షలు ట న్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారు. నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేసిన కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులను ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, పీవో చంద్రశేఖర్‌ అభినందించా రు. గతేడాది కూడా 30లక్షల టన్నుల లక్ష్యానికి 35.05లక్షల సాధించి 117శాతంలో నిలిచింది.

రాజాపూర్‌వాసుల ఆందోళన

రామగిరి(మంథని): తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని రాజాపూర్‌ వాసులు అన్నారు. పెద్దపల్లి – మంథని రోడ్డు, ఎల్‌ – 6 కెనాల్‌ పగుళ్ల ను ఆదివారం పరిశీలించి ఆందోళన చేశారు. బ్లాస్టింగ్‌లతో రోడ్డు కుంగుబాటుకు గురైతే సింగరేణి అధికారులు వక్రీకరించారని అన్నారు.

వేతనాల కోసం ఫిర్యాదు 1
1/3

వేతనాల కోసం ఫిర్యాదు

వేతనాల కోసం ఫిర్యాదు 2
2/3

వేతనాల కోసం ఫిర్యాదు

వేతనాల కోసం ఫిర్యాదు 3
3/3

వేతనాల కోసం ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement