
బూచాళ్లమ్మ.. బూచాళ్లు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగశాఖ, జాతీయ దర్యాప్తు సంస్థలు, స్థానిక పోలీసులు కోరుతున్నారు. తాజాగా థాయ్‌లాండ్ కేంద్రంగా వెలుగుచూసిన మానవ అక్రమ రవాణాలో సూత్రధారులు, పాత్రధారులు చివరికి బాధితులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టాలు, పాస్‌పోర్టులు రాగానే రెక్కలు కట్టుకుని, కలల కొలువు చేసేందుకు విదేశాలకు వెళ్దామనుకునే యువతకు ఈ ఉదంతం ఒక హెచ్చరిక. అదే సమయంలో భారతీ యుల క్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరూపించింది. థాయ్‌లాండ్, మయన్మార్‌లో చిక్కుకున్న దాదాపు 540 మందిని కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్‌ల చొరవతో రెండు ప్రత్యేక సైనిక విమానాల్లో ఇళ్లకు తరలించింది.

బూచాళ్లమ్మ.. బూచాళ్లు!

బూచాళ్లమ్మ.. బూచాళ్లు!