
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. హెల్త్ సబ్‌సెంటర్లు, హాస్టల్, పాఠశాల భవనాల మరమ్మతులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద చేపట్టిన సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తిచేసి ఈనెల 29లోగా బిల్లులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీశ్‌బాబు, సీపీవో రవీందర్ తదితరులు ఉన్నారు.
పీపీఈ కిట్లు ధరించాలి
జ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ సూచించారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీపీఈ కిట్లు ధరించకపోతే కలిగే నష్టాలు, అనర్థాల గురించి వివరించారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, చీర లు, టవల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రా మణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి
ఎలిగేడు(పెద్దపల్లి): గ్రామాల్లో పారిశుధ్య ప నులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచా యతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సూచించారు. సుల్తాన్‌పూర్, ధూళికట్ట, ముప్పిరితోట గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను డీపీవో శనివారం తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిశుభ్రతోనే ఆరోగ్యవంతంగా ఉంటామని అన్నారు. ఎంపీవో ఆరిఫ్, ధూళికట్ట పంచాయతీ కార్యదర్శి పున్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 248 మంది గైర్హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు 248 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. పరీక్షకు 3,895 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,647 మంది (93.6శాతం) హాజరయ్యారని వివరించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆమె పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్