
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ధర్మారం(ధర్మపురి): కాంగ్రెస్ ప్రజాపాలన లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రభు త్వ విప్ లక్ష్మణ్‌కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వి వేక్ ఆకాంక్షించారు. గోపాల్‌రావుపేట, దొంగ తుర్తిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్ర హ్మోత్సవాలకు వారు హాజరయ్యారు. నర్సింహులపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. క టికెనపల్లిలోని శ్రీవేకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొడారి హన్మయ్య, పాలకుర్తి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీని కలిసిన నాయకులు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిశోర్ ఝా ను రాష్ట్ర కనీస వేతన అమలు కమిటీ చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, బహిరంగ మద్యపాన నిషేధం లాంటి విషయాలను నాయకులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, వికాస్‌కుమార్‌యాదవ్, ఎండీ అక్రం, దాస్, సదానందం, మార్కండేయ, నవీన్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు హుండీ లెక్కింపు
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివా రం లెక్కించనున్నట్లు ఈవో శంకరయ్య తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని శ్రీవేకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం 10 గంటలకు హుండీ ఆదాయం లెక్కిస్తామని ఈవో తెలిపారు.
పంట రక్షణ కోసం..
పెద్దపల్లిరూరల్: పంటలను కోతుల బారినుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటా లు పడుతున్నారు. కొందరు అన్నదాతలు మంచెలను వేసి శబ్దం చేసి వానరాలను తరమికొడుతున్నారు. ఇంకొందరు ఆధునిక సాంకేతికతతో రూపొందించిన పరికరాలతో భారీ శబ్దం చేస్తూ కోతులను భయపెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారు. అలాంటి పరికరాలను తయారు చేసిన కొందరు పట్టణంలో ఒక్కో దాన్ని రూ.250కి విక్రయిస్తున్నారు.

ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ప్రజలు సుభిక్షంగా ఉండాలి