జిల్లాలో ఈనెల 10 నుంచి 13 వరకు
నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు
జిల్లా 10 11 12 13
కరీంనగర్ 38.1 38.7 39.9 39.4
జగిత్యాల 38.6 39.1 40.3 39.9
పెద్దపల్లి 39.3 39.6 40.3 40.0
సిరిసిల్ల 39.8 39.5 40.0 38.7
జగిత్యాలఅగ్రికల్చర్/కరీంనగర్‌అర్బన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. 15న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.