
మాట్లాడుతున్న మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
● పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రాష్ట్రంలో నాలుగు నెలల నుంచి అరాచక పాలన కొనసాగుతోందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం రాత్రి స్థానిక కౌన్సిలర్ గొట్టం లక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తమ పార్టీకి ఓట్లు వేయలేదని, కక్షగట్టి దాడులు చేయడం మానుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతి అమలు చేశామని, అయితే, పోలీసులు ప్రస్తుతం బైండోవర్లు, బెదిరింపులు చేస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలని కోరారు. ప్రజలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, తాళ్లపెల్లి ఆగయ్య ఫౌండేషన్ చైర్మన్ తాళ్లపల్లి మనోజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.