రామగిరి @ 44.9 | - | Sakshi
Sakshi News home page

రామగిరి @ 44.9

Apr 19 2024 1:00 AM | Updated on Apr 19 2024 1:00 AM

గోదావరిఖని చౌరస్తా రోడ్డుపై ఆమ్లెట్‌ వేస్తున్న సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు కనకయ్య - Sakshi

గోదావరిఖని చౌరస్తా రోడ్డుపై ఆమ్లెట్‌ వేస్తున్న సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు కనకయ్య

● జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● ఉదయం 10 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు
ఉష్ణోగ్రత లు (డిగ్రీలలో)

కోల్‌సిటీ(రామగుండం): భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సెగలు రేపుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండకు తోడు వడగాడ్పులతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గురువారం జిల్లాలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగిరి మండలం కల్వచర్లలో 44.9, ఈసాలతక్కల్లపల్లిలో 44.2, మధ్యాహ్నం రామగుండంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతలకు జనం అనారోగ్యాలకు గురవుతున్నారు. జీజీహెచ్‌ ఆస్పత్రితోపాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సీజనల్‌ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వడదెబ్బ లక్షణాలు, తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు.

18న 44.9

17న 43.5

16న 43.1

15న 41.4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement