
గోల్డ్‌మెడల్‌తో గణేశ్‌నాయక్
గోదావరిఖనిటౌన్: స్థానిక సప్తగిరికాలనీలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల విద్యార్థులు జిల్లాస్థాయి స్టేట్ సెలక్షన్స్ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఇందులో 1,500 మీటర్ల పరుగు పందెంలో డి.అజయ్ గోల్డ్‌మెడల్, యు.మణిదీప్ సిల్వర్ మెడల్ సాధించారు. 3,000 మీటర్ల రన్నింగ్‌లో జి.విష్ణువర్ధన్ గోల్డ్‌మెడల్, డి.అజయ్ సిల్వర్ మెడల్ సాధించారు. 100 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జెంప్‌లో గణేశ్‌నాయక్ రెండు గోల్డ్‌మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యాడు. వీరిని ప్రిన్సిపాల్ శ్రీకాంత్, పీఈటీ మంథెన వెంకటేశ్, ఉపాధ్యాయులు తదితరులు బుధవారం అభినందించారు.