ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

Nov 15 2023 1:32 AM | Updated on Nov 15 2023 1:32 AM

- - Sakshi

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేశ్‌సింగ్‌ రాణా

జ్యోతినగర్‌(రామగుండం): అభ్యర్థులు ఎన్నికల క మిషన్‌ నిబంధనలు తప్పక పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేశ్‌సింగ్‌రాణా సూచించారు. ఎన్టీపీసీ మిలీనియంహాల్‌లో అభ్యర్థులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి అరుణశ్రీతో కలిసి మాట్లాడారు. ప్రచార అనుమతి కోసం 48 గంటల ముందు సువిధ యా ప్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన దరఖాస్తులల కోసం రామగుండం రిట ర్నింగ్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగం, ఆపరేట ర్లను ఏర్పాటు చేశామన్నారు. పోస్టర్లు, వీడియోలు, ఆడియో పాటల కోసం ఎంసీఎంసీ(మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ) ద్వారా అనుమతి పొందాలన్నారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆదేశాల ను పాటించాలన్నారు. తమపై క్రిమినల్‌ కేసులు ఉంటే ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూస్‌ పేపర్లలో ఈనె ల 16 నుంచి 27వ తేదీ మధ్య మూడుసార్లు యాడ్‌ ఇవ్వాలనే నిబంధన ఉందన్నారు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందన్నారు. ఫిర్యాదుల కోసం రోజూ సాయంత్రం ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌ జ్యోతిభవన్‌ అతిథి గృహంలో సంప్రదించాలని సూ చించారు. ఇందుకోసం మొబైల్‌ నంబరు : 83338 94668, ల్యాండ్‌లైన్‌ నంబరు 08728–293166ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సహా య వ్యయ పరిశీలకుడు అశోక్‌ కుమార్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ నాగేశ్వర్‌, ఏఆర్వోలు కుమారస్వామి, రామ్మోహన్‌రావు, జ్యోతి, మీడియా, క మ్యూనికేషన్‌ ప్లాన్‌ నోడల్‌ అధికారి రజని ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement