
పెద్దపల్లిరూరల్: మనదేశంలో ఎన్నికలను బ్యా లెట్ పేపర్‌తో నిర్వహించేవారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో బ్యాలెట్ పేపర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌యంత్రాలను (ఈవీఎం) అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా 1982 మే19న కేరళ రాష్ట్రంలోని పరూర్ నియోజకవర్గంలో వినియోగించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని షాద్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు 1982, 83లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వాడారు. అయితే వాటి పనితీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలుపగా కొంతకాలం నిలిపివేశారు. ఆ తర్వాత 19 99, 2004లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అయితే తాము ఎవరికి ఓటు వేశామో ఓటరు తెలుసుకునేందుకు వీలుగా 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు వీవీప్యాట్‌ను (ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అనుసంధానించారు. దీంతో ఓటర్లు తాము ఓటు వేయాలనుకునే వారికే వేశామా లేదా అని నిర్ధారించుకునేందుకు వీలుకలిగింది.
మీకు తెలుసా..!