
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న రాజేశ్‌సింగ్‌రాణా
గోదావరిఖని(రామగుండం): ఎన్నికల పక్రియ, పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని రామగుండం పోలీస్‌కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. సోమవారం రామగుండం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికల స్ట్రాంగ్ రూం, సెక్యూరిటీ లాగ్‌బుక్ పరిశీలించారు. రిటర్నింగ్ కార్యాలయం పరిసరాలు తనిఖీ చేశారు. భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. సీపీ వెంట రిటర్నింగ్ ఆఫీసర్ జె.అరుణశ్రీ, ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు, రామగుండం సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్, వన్‌టౌన్ ఎస్సై శరణ్య, మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారి రజని తదితరులున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
గోదావరిఖని(రామగుండం): పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేశ్‌సింగ్‌రాణా ఆదేశించారు. సోమవారం రామగుండం నియోజవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి, వివరాలు తెలుసుకున్నారు. కేంద్రాల్లోని లోపలి, బయటి గోడలపై ఉన్న స్కూల్ సంబంధిత పెయింటింగ్ చిత్రాలను పరిశీలించి, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు కనబడకుండా కవర్ చేయాలని ఆదేశించారు. ఎపిక్ కార్డుల పంపకాల తీరు, కొత్త ఎపిక్‌కార్డు హోల్డర్లకు ఏ రకంగా పంపిణీ చేస్తున్నారో బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పరిధిలో ఆరుకుపైగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు, మెడికల్ క్యాంప్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
రాకుమారకు జాతీయస్థాయి బహుమతి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన ప్రముఖ రచయిత, కవి, సాహితీవేత్త రాకుమార రాసిన ‘వసివాడుతున్న పసితనం’ కవిత జాతీయస్థాయి బహుమతికి ఎంపికయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన డాక్టర్ పట్టాభి కళాపీఠం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల జాతీయస్థాయి కవితల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది కవులు వివిధ కవితలను పంపించారు. కాగా రాకుమార రాసిన ‘వసివాడుతున్న పసితనం’ కవిత జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతికి ఎంపికై నట్లు డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు తూములూరి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈనెల 24న గుంటూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాకుమారకు బహుమతి అందజేయనున్నట్లు తెలిపా రు. కాగా, రామకుమార ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయస్థాయి వచన, గేయ, పద్య కవితల పో టీల్లో 67 వరకు బహుమతులు సాధించారు. ఈసందర్భంగా ఆయనను పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు అభినందించారు.
ఆర్‌వో కార్యాలయం సమీపంలో దుకాణాల మూసివేత
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయ సమీపంలోని దుకాణాలను పోలీసు అధికారులు మూసివేయించారు. సోమవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ సమయంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులందడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించడంతో పాటు సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అయితే ఎన్నికల పుణ్యమా అని తమ వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతుందంటూ పలువురు వ్యాపారులు వాపోయారు.

మూసి ఉన్న దుకాణాలు

కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ రెమారాజేశ్వరి

Comments
Please login to add a commentAdd a comment