TS Peddapally Assembly Constituency: 'మీ ఎమ్మెల్యే బంగారం కాదు..' : మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
Sakshi News home page

'మీ ఎమ్మెల్యే బంగారం కాదు..' : మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

Oct 3 2023 12:28 AM | Updated on Oct 3 2023 12:02 PM

- - Sakshi

పెద్దపల్లి:మీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంగారమా? ఇక్కడి ప్రజలందరికీ రేకుల దొంగ, మట్టి, ఇసుక దొంగగానే తెలుసు. తుప్పు పట్టిన ఇనుపముక్కను బంగారం అని ఎట్ల చెప్తవ్‌.. అని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తనపై ఎన్నికల్లో గెలిస్తే బీఆర్‌ఎస్‌లోకి వస్తానంటూ అక్కడక్కడ చెప్పుకుంటున్నారనే వ్యాఖ్యలకు ఆధారాలు చూపుతవా? అని ప్రశ్నించారు. షాడో సీఎం కేటీఆర్‌, అసలు సీఎం కేసీఆర్‌ ఎవరొచ్చినా అడ్డుకుంటరనే భయంతో పోలీసులను పంపి ప్రతిపక్షాలను నిలువరించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. 24 గంటల కరంటు సరఫరా చేస్తున్నారనే విషయాన్ని నిరూపిస్తే తాను ఈసారి ఎన్నికల్లోనే పోటీచేయనని సవాల్‌ విసిరారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు చేయాల్సిన చిన్నపనులను కూడా చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతోనే మీ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే కేటీఆర్‌ సభకే పెద్దపల్లి, జూలపల్లి జెడ్పీటీసీలు రాలేదన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజయ్య, నాయకులు సురేశ్‌గౌడ్‌, అన్నయ్య, మల్లయ్య, దామోదర్‌, సుభాష్‌రావు, సతీశ్‌, మహేందర్‌, విజయ్‌, రాజు, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement