జాతీయ పంచాయతీ అవార్డులు (నేషనల్ పంచాయత్ అవార్డ్స్) పేదరికంలేని, మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన, బాలల స్నేహపూర్వక, సమృద్ధి నీటి లభ్యత, పచ్చదనం–శుభ్రత, స్వయం సమృద్ధి – మౌలిక సదుపాయాలు, సామాజిక సమన్యాయం – సురక్షిత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక గ్రామం అంశాలపై దేశవ్యాప్తంగా పంచాయతీలు పోటీపడ్డాయి.
సుల్తాన్‌పూర్ టాప్..
ప్రజలకు పంచాయతీలు అందిస్తున్న సేవలను గుర్తించి మెరుగైన సేవలందించే పంచాయతీల పాలకులను ప్రోత్సహించేలా కేంద్రప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కోసం జిల్లాలోని అన్ని పంచాయతీలు పోటీపడ్డాయి. అందులో పలు అంశాల్లో ప్రతిభను కనబర్చిన 27 పంచాయతీలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేసిన విషయం విదితమే. అందులో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ పంచాయతీ నాలుగు అంశాల్లో ప్రతిభ చూపి అగ్రస్థానంలో నిలిచింది. రామగిరి మండలం నాగెపల్లి మూడు అంశాల్లో.. మంథని మండలం నాగారం, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి రెండేసి అంశాల్లో ప్రతిభ చూపాయి.