పింఛన్‌ ఆపేస్తాం..! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఆపేస్తాం..!

Nov 28 2026 1:14 AM | Updated on Nov 28 2026 1:14 AM

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 రేషన్‌ కార్డు తీసేస్తాం.. పింఛన్‌ ఆపేస్తాం..! ● సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లకు బెదిరింపులు ● గ్రామాల్లో అధికార పార్టీ ఆగడాలు ● అయినా బెదరని పల్లె ఓటర్లు మూడు పార్టీలు కలిసినా.. ఓటర్ల తీర్పు తేడానే! రెండో విడతకు సర్వం సిద్ధం

న్యూస్‌రీల్‌

బెదిరింపులా.. ఓటర్ల నిర్ణయమా?

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
రేషన్‌ కార్డు తీసేస్తాం..
● సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లకు బెదిరింపులు ● గ్రామాల్లో అధికార పార్టీ ఆగడాలు ● అయినా బెదరని పల్లె ఓటర్లు

సాక్షి, పార్వతీపురం మన్యం:

పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నా రు. రెండున్నరేళ్ల పాలనలో ఒక్కరికీ పింఛన్‌ ఇచ్చింది లేదు. సంక్షేమ పథకాలు మంజూరు లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే రేషన్‌ కార్డులు తొలగిస్తామని, పింఛన్లు నిలిపివేస్తామని కొందరు నాయకులు హెచ్చరిస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. ఓటు వేయకపోతే ప్రభు త్వ పథకాలు అందవన్న భయాన్ని పేదల మనసు ల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటర్లు తమ నిర్ణ యానికే కట్టుబడుతున్నారనే సంకేతాలు తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమికి ఓటర్లు గట్టి సంకేతాలిచ్చారు. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలూ కలిసి ఎన్నికల బరిలోకి దిగినా ఆశించిన స్థాయిలో స్థానాలను దక్కించుకోలేకపోయాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ గణనీయమైన స్థానాలను సాధించడం కూటమి నేతలకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. అధికార బలం, కూటమి సమీకరణాలు, ప్రచార ఆర్భాటం ఉన్నప్పటికీ గ్రామీణ ఓటర్లు తమదైన తీర్పు ఇచ్చారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పంపకాల ఎర వేస్తూనే, సంక్షేమ పథకాల నిలిపివేత పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నార నే విమర్శలు ఈ ఎన్నికల ప్రచారానికి కొత్త వివాదా న్ని తెరపైకి తెస్తున్నాయి.

తొలి విడత ఫలితాల నేపథ్యంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. ఈ నాలుగు మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 1,72,951 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

●ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శుక్రవా రం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగిసింది. దీంతో గ్రామాల్లో మైకుల హోరు, ర్యాలీలు, ప్రచార వాహనాల సందడి ఒక్కసారిగా నిలిచిపోయాయి. చివరి రోజు వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, నాయకులు చేసిన ప్రయత్నాలకు తెరపడింది. పంపకాలకు అభ్యర్థు లు సిద్ధమయ్యారు. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆదివారం పోలింగ్‌తో తేలనుంది.

సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లపై ఒత్తిడి తీసుకొ స్తున్నారన్న ఆరోపణలు నిజంగా ఓటర్లను ప్రభావితం చేస్తాయా? లేక తొలి విడతలో మాదిరిగానే తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేసి అధికార పార్టీకి మరోసారి గుణపాఠం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రేషన్‌ కార్డు, పింఛన్‌ వంటి పేదల జీవనాధార పథకాలను రాజకీయ బెదిరింపులకు వాడుతున్నారనే ఆరోపణలు ఎన్నికల వేళ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి హెచ్చరికలకు ఓటర్లు తలొగ్గుతారా.. లేక ఓటు విలువను చాటుతారా అన్నది రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement