ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
వీరఘట్టం: రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరం ఉందని, వైఎస్సార్‌సీపీతోనే అన్ని వర్గాల ప్రజల కు సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వీరఘట్టం మేజరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కళింగ ప్రేమభూషణరావుకు మద్దతుగా శుక్రవారం వీరఘట్టంలో ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రచారం చేశారు. వీరఘట్టంకు సమర్ధుడైన నాయకుడు అవసరం ఉందని, అందుకు ప్రేమభూషణరావు సరైన వ్యక్తి అని, అన్ని కోణాల్లో ఆలోచించి వీరఘట్టం ప్రజ లు సర్పంచ్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో క్యారెట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని, తోటపల్లి పాత అయకట్టు కాలువల ఆధునికీకరణ పనులను రద్దుచేసి ఈ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం కొనసాగుతోందన్నారు. బియ్యం కిలో రూ.100 ఉండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బతుకుభారంగా మారుతోందన్నారు. మరో రెండున్నరేళ్ల తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వీరఘట్టం కాలేజీ కూడలిలో ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్ కూడలి, తెలగ వీధి కూడలి, గ్రోమోర్ సెంటర్, కొత్తబప్టాండ్ మీదుగా బార్నాలవీధి చేరుకుంది. ప్రతీ కూడలి లో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడారు.
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ఎనిమిది మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిందని, ఈ నెల 29న జరగనున్న రెండోవిడత ఎన్నికలకు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ మాధవ్‌రెడ్డి తెలిపారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, అదనపు బలగాలతో గస్తీ నిర్వహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని తెలిపారు. రెండు, మూడు విడతల ఎన్నికలకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని, నియమావళి ఉల్లంఘనలు కనిపిస్తే పోలీసులకు లేదా 112 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.


