ఏడు పంచాయతీలు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

Nov 28 2026 1:14 AM | Updated on Nov 28 2026 1:14 AM

ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

పాచిపెంట: మండలంలో మూడో విడతలో జరగనున్న 29 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం తొమ్మిది కేంద్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఏడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా, వీటిలో నాలుగు వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరాయి. సతాభి, తంగలాం, మెలియకంచేరు, బొర్రమామిడి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆజూరు, విశ్వనాథపురం, మూటకూడు పంచాయతీలు టీడీపీ ఖాతాలో చేరాయి. ఏడు పంచాయతీల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లతో పాటు 50 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ బీబీజే పాత్రో తెలిపారు. మిగిలిన పంచాయతీల్లో మరో 55 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, 149 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించారు.

సతాభిలో మాక్‌ పోలింగ్‌తో ఏకగ్రీవం!

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అందించే ఏకగ్రీవ ప్రోత్సాహకాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో సతాభి గ్రామస్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ఎన్నికలకు ముందే బ్యాలెట్‌ పత్రాలను ముద్రించి గ్రామస్థాయిలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు సుబ్రహ్మణ్యం, టీడీపీ మద్దతుదారుడు రామయ్య పోటీపడగా, సుబ్రహ్మణ్యం 18 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామస్తుల నిర్ణయం మేరకు విజేత ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో పంచాయతీ ఏకగ్రీవమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement