ఓటింగ్‌లో ఎంపీపీగా ఆదిలక్ష్మి,
వైస్ ఎంపీపీగా పద్మ ఎన్నిక
సీతంపేట:
సీతంపేట మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసు కుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ఎంపీపీగా హిమరక ఆదిలక్ష్మి, వైస్ ఎంపీపీగా సవర పద్మ ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియలో 16 మంది ఎంపీటీసీ లు పాల్గొన్నారు. ముందుగా సభ్యులతో మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఓటింగ్ ప్రక్రియను పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పర్యవేక్షించారు.
చేతులు ఎత్తి మద్దతు తెలిపిన ఎంపీటీసీలు
ఎంపీపీ పదవికి వైఎస్సార్‌సీపీ తరఫున హిమరక ఆదిలక్ష్మి పోటీలో నిలవగా పూతికవలస ఎంపీటీసీ వూయక రవితేజ ప్రతిపాదించారు. దోనుబాయి ఎంపీటీసీ సభ్యురాలు కూరంగి రత్నకుమారి బలపరిచారు. కూటమి తరఫున హడ్డుబంగి ఎంపీటీసీ సభ్యురాలు సవరతోట గౌతమిని ఎంపీపీ అభ్యర్థిగా చినబగ్గ ఎంపీటీసీ నీలయ్య ప్రతిపాదించగా, పెదరామ ఎంపీటీసీ నాగేశ్వరరావు బలపర్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఆదిలక్ష్మికి 9 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు చేతులు ఎత్తేపద్ధతిలో మద్దతు పలికారు. గౌతమికి కేవలం ఏడుగురు కూటమి ఎంపీటీసీలు మద్దతు పలికారు. 2 ఓట్ల వ్యత్యాసంతో ఆదిలక్ష్మి ఎంపీపీగా గెలుపొందారు. అదే ఒరవడిలో వైస్ ఎంపీపీగా కోడిశ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు సవర పద్మ, కూటమి అభ్యర్థి ఆరిక సువర్ణపై గెలుపొందారు.
మండల అభివృద్ధికి కృషిచేస్తా...
సీతంపేట మండలాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తా నని నూతనంగా ఎంపీపీగా ఎన్నికై న హిమరక ఆదిలక్ష్మి స్పష్టంచేశారు. తమ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.బి.మిశ్రో, తహసీల్దార్ మల్లేశ్వ రరావు, డిప్యూటీ ఎంపీడీఓలు మోహన్‌రావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


