సీతంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీచేస్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించాలని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరా యి కళావతి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతంపేట ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు పార్టీ నాయకులను వరించడం సంతోషదాయకమన్నా రు. నూతనంగా ఎంపికై న ఎంపీపీ హిమరక ఆదిలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు కుండంగి సరస్వతితో పాటు ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్త లు, అభిమానులు గురువారం మిఠాయిలు పంచు కుని సంబరాలు చేసుకున్నారు. జగనన్న నాయక త్వం వర్ధ్దిల్లాలి, జై జగన్, జైజైజగన్ అంటూ నిన దించారు. ఇదే స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను 53 పంచాయతీల్లోనూ సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలన్నారు. 2029లో జగనన్నను మనమంతా ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ స భ్యులు సవరలక్ష్మి, కూరంగి రత్నకుమారి, ఊయక రవితేజ, సవర రవికుమార్, నిమ్మక భూషణరావు, నిమ్మక ఆరుద్ర, ఆరిక భారతి, పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్ నిమ్మక కాంతారావు, మండల కన్వీనర్ కె.వెంకునాయు డు, పార్టీ నాయకులు హరిప్రసాద్ పాల్గొన్నారు.


