ఎంపీపీ ఎన్నికల్లో బరి తెగించిన అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు గుమ్మలక్ష్మీపురం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీకి గాలం మక్కువలోనూ స్వయంగా ప్రజాప్రతినిధి రాయ‘బేరాలు’
సాక్షి, పార్వతీపురం మన్యం:
అధికారం ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుందని స్థానిక ఎన్నికల్లో అధికార టీడీపీ నిరూపించింది. ఓటర్లకు గాలం వేయడం దగ్గర నుంచి ఎన్నిక ల సమయంలో బెదిరింపులు, అరాచకాలు సృష్టించడం వరకూ అన్నిదారులూ వెతుక్కుంది. కొన్ని చోట్ల సఫలీకృతం కాగా.. ఇంకొన్ని చోట్ల ప్రజలు వారి ఎత్తులను తిప్పికొట్టారు. చివరికి ఎంపీపీ ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుయుక్తులకు మరోసారి పదును పెట్టారు. అడ్డంగా అడ్డదారిలో వెళ్లయినా సరే.. ఎంపీపీ పీఠాలన్నీ కై వసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేశారు. ప్రజాతీర్పునకు సైతం భంగం కలిగించారు.
జిల్లాలోని 15 మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ గురువారం సాగింది. ఇందులో వైఎస్సార్‌సీపీ– 2, టీడీపీ–12, జనసేన–1 చొప్పు న ఎన్నికయ్యారు. గుమ్మలక్ష్మీపురం ఎంపీటీసీ స్థానాలు 14 ఉండగా.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరో ఏడు సాధించాయి. అందుకోసమని పి.ఆమిటి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీపై అధికార గర్వంతో టీడీ పీ గాలం వేసింది. తమ వైపునకు తిప్పుకొంది. దీనిని వైఎస్సార్‌సీపీ సభ్యులు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. మక్కువ ఎంపీపీ విషయంలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇక్కడ కూడా నయానో, భయానో ప్రతిపక్ష ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి ఏకంగా ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడారు. విఫలప్రయత్నం చేశారు. ప్రజాతీర్పును గౌరవించా ల్సిన చోట.. అధికార పార్టీ అరాచకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు మిత్రపక్షమైన జనసేనకు కూడా టీడీపీ ద్రోహం చేసింది. కేవలం ఒక ఎంపీపీ స్థానాన్నే ఇచ్చింది. బలిజిపేట లో 17 మందికి 15, జియ్యమ్మవలసలో 15 మంది కి 14, కురుపాంలో 14 మందికి 13 చొప్పున స భ్యులు హాజరయ్యారు. ఎంపీటీసీల పదవీ కాలం గురువారంతో అధికారికంగా ప్రారంభమైంది.


