● ప్రభుత్వ సిబ్బందితో ‘ప్రచారం’ ● ఊరికి రూ.31 లక్షలిస్తారు.. మద్దతు పలకాలన్న ఉపాధి హామీ ఉద్యోగి
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ: ఏకగ్రీవ పంచాయతీల విధానం వల్ల సమయం, డబ్బు, శ్రమ అన్నీ ఆదాఅవుతాయి. తమకు మంచి చేస్తాడనే నాయకుడి విషయంలో గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. గ్రామాల్లో ఏకగ్రీవాలైతే జరుగుతున్నాయి గానీ.. ఈ ప్రక్రియ భిన్నంగా సాగుతోంది. ప్రభు త్వం ప్రోత్సాహకాల ఆశ చూపి, ఏకగ్రీవ పంచాయతీల పేరిట తమవారికి పదవులను కట్టబెట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇందు కు జిల్లా అధికారుల పరోక్ష సహకారం తీసుకుంటోంది. వీరు అన్ని విభాగాల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందిని పురమాయించి గ్రామస్తులకు ‘అవగాహన‘ కల్పిస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీల లాభాలను, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలను వివరించాల్సింది పోయి.. ‘ఫలానా అభ్యర్థి.. ఇన్ని లక్షలు ఇస్తాడు. మీరంద రూ ఒకే మాట మీద ఆయనకే మద్దతు పలకండి‘ అంటూ ప్రభు త్వ సిబ్బంది కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నారు. జిల్లాలోని మక్కువ మండలంలో సర్పంచ్ పదవిని ఆశించిన అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఒక ఉద్యోగి ద్వారా రూ.31 లక్షలకు ఆ ఊరి ప్రజల వద్ద బేరం పెట్టా డు. సదర ఉద్యోగి సైతం ఉపాధి హామీ వేతనదారులు, ప్రజల వద్దకు వెళ్లి.. ఊరి బాగుకోసం ఆయనకు మద్దతు పలకాలని కోరడం విశేషం. తమకు కలెక్టర్, డ్వామా పీడీ నుంచి ఆదేశాలు వచ్చాయని.. అందుకే ఏకగ్రీవ పంచాయతీల కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నామని సదర ఉద్యోగిని చెప్పడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం ఉన్న అన్ని శాఖలకూ ఈ బాధ్యతలను అధికారులు అప్పగించారు. కొన్ని గ్రామాల్లో వేలం పాటద్వారా సర్పంచ్ పదవులకు బేరం పెడితే.. దానికి అధికారులు వంత పాట పాడటం విశేషం.
ఏకగ్రీవాల ఉద్దేశమే వేరు...
ఏకగ్రీవ పంచాయతీలకు ఎంపికై తే 5 వేలు లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేల మందికి పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు చొప్పున ప్రోత్సాహక నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సేవలు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో విభేదాలు, కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా ప్రజలంతా ఐకమత్యంతో ముందు కు సాగితే తప్పు లేదు. వారికి అభివృద్ధి పనుల ఆశ చూపి.. రూ. లక్షల్లో కుమ్మరిస్తే, రేపు గెలిచాక.. ఆ వ్యక్తి తన ‘సంపాదన’ పెంచుకోవడానికే మొగ్గు చూపుతాడు గానీ, ఊరిని ఉద్ధరిస్తాడనుకోవ డం అత్యాశే అవుతుంది. జిల్లాలో జరుగుతున్న తొలివిడత ఎన్నిక ల ప్రక్రియలో భాగంగా ఎనిమిది మండలాల పరిధిలోని మొత్తం 2,116 వార్డులకు గాను 782 వార్డులకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇవన్నీ దాదాపు ఏకగ్రీవమైనట్లే. ఇప్పటికే పలు సర్పంచ్ స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఇందులో చాలా వరకూ అధికార పార్టీ అర్థబలం, అంగబలంతో చేసుకున్నవే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


