మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి

Nov 20 2026 1:01 AM | Updated on Nov 20 2026 1:01 AM

మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ● వైస్‌ ఎంపీపీగా అల్లు లీలావతి

మక్కువ: మక్కువ ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన మావుడి రామలక్ష్మి, వైస్‌ ఎంపీపీగా అల్లు లీలావతి ఎన్నికయ్యారు. మక్కువ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎన్నికల అధికారులు ముందుగా వైఎస్సార్‌సీపీకి చెందిన 8 మంది, టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీఎస్పీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందిన పెంట ఉమా ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో అధిక మెజార్టీ ఉన్న రామలక్ష్మి ఎంపీపీగా, లీలావతి వైస్‌ ఎంపీపీగా ఎన్నికై నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికై న వారితో పాటు ఎంపీటీసీలను వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ మావుడి తిరుపతినాయుడు దుశ్శాలువలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement