గిరిజన విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

గిరిజన విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం

గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న మాజీ డిఫ్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురై రెండు గదుల్లో ఇరుక్కుని పడున్న సుమారు 80 మంది విద్యార్థినులను చూసి చలించిపోయారు. అలాగే కురుపాం సీహెచ్‌సీలో వైద్యం పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఇదే కురుపాం గురుకుల పాఠశాలలో గతేడాది అక్టోబర్‌లో ఇద్దరు గిరిజన విద్యార్థినులు పచ్చకామెర్లతో మృతిచెందారని, 200 మంది వరకు విద్యార్థినులు పచ్చకామెర్ల లక్షణాలతో తీవ్రఅస్వస్థకు గురై ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందారని గుర్తుచేస్తూనే.. అప్పట్లో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో.. ఇప్పుడు కూడా గిరిజన విద్యార్థినుల పట్ల ప్రభుత్వం, పాఠశాల సిబ్బంది అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడీ పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఎంత హైజెనిక్‌గా ఉండాల్సిన సిక్‌ రూంను స్టోర్‌ రూంలా మార్చేశారని, అస్వస్థతకు గురైన బాలికలకు గంజి అన్నం పెట్టి సరిపెడుతున్నారని,సరిపడా ఫ్యాన్లు కూడా అమర్చలేదని.. ఇదేనా గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధ్ధి అని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, బాలికలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement