వంగర: భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన యువకుడు టొంపాకి దుర్గారావు ఎంపికయ్యాడు. గతంలో భారతదేశం అంధుల క్రికెట్ సంఘం(సెబి) 17 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఆ జట్టులో దుర్గారావును కెప్టెన్‌గా ప్రకటించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నవంబర్ 15వ తేదీ నుంచి రెండవ పురుషుల బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ పోరు జరగనుంది. ప్రస్తుతం దుర్గారావు సారథ్యంలో సభ్యులు ఢిల్లీలో కొన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు. మారుమూల ప్రాంతం వంగర మండలం కొప్పరవలస గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన దుర్గారావు భారత అంధుల క్రికెట్ జట్టుకు సారథ్యం వహించడం పట్ల గ్రామంలోని యువకులు, క్రీడాకారులు, పెద్దలు, మండల ప్రజలు అభినందిస్తున్నారు.


