పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సరళిని కలెక్టరేట్‌లోని ప్రత్యే క కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నిక ల అధికారి డా. ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం పర్యవేక్షించారు. డీఆర్‌ఓ కె. హేమలత, జెడ్పీసీఈఓ సుధాకర్‌తో కలిసి పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ వేగవంతం చేయాలని, ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు.
గరుగుబిల్లి: ప్రజా స్వామ్య పండుగలో ఓటు హక్కుకు ప్రాధాన్యతనిస్తూ నవ వధువు వాణి ఆందరికీ ఆదర్శంగా నిలిచింది. గరుగుబిల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకు న్న అనంతరం పెళ్లి వేడుక కోసం జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి మేళ తాళాలతో సంప్రదాయ బద్ధంగా బంధువులతో కలిసి బయల్దేరి వెళ్లింది. వివాహ వేడుక కంటే ముందుగా ఓటు వేయడానికే ప్రాధాన్యం ఇచ్చిన వాణి నిర్ణయంపై పలువురు అభినందనలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆమె చాటి చెప్పింది. ఓటు వేసి పెళ్లికి వెళ్లిన నవ వధువు తీరు ప్రజా స్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
భామిని: మండలంలో రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. మండలంలో విస్తరించిన ఏబీ రోడ్డు గొయ్యి పూడ్చివేత మరమ్మతు పనులు ప్రభుత్వం చేపట్టలేదు. ప్రధానంగా పసుకుడి వద్ద ఏబీ రోడ్డులో ఏర్పడిన రోడ్డు గుంత మరిన్ని ప్రమాదాలకు హేతువుగా మారింది. వరుసగా పెరుగుతున్న ప్రమాదాల నివారణకు స్థానికులు అప్రమత్తమై రోడ్డు గుంతలో ఎరుపు రంగు గోనెసంచులతో ఎర్రజెండాతా తయారు చేసి ఎగురు వేశారు. ఈ జెండాను చూసిన వాహనదారులు అప్రమత్తమై దూరంగా ప్రయాణిస్తారని ఆశిస్తు పెట్టారు.
గరుగుబిల్లి: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి యోగ క్షేమాలు, విద్య, వసతి, భోజన సదుపా యాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ అమలు తీరును తెలుసుకున్నారు. వసతి గదులు, వంట గదిని పరిశీలించి పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రిన్సిపాల్ రజనీకుమారి, సిబ్బంది ఉన్నారు.
విజయనగరం కల్చరల్ (క్రైమ్): పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకులను చదురుగుడిలో గురువా రం లెక్కించారు. మొత్తం 19 రోజులకు చదురుగుడిలోని హుండీల నుంచి రూ. 52,58,515 లు, బంగారం 43.200 గ్రాములు, వెండి 332 గ్రామాలు వచ్చినట్టు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. లెక్కింపులో 62 మంది సేవకులు పాల్గొన్నారు.


