సీసీ కెమెరాలు ఆపేసి ఎమ్మెల్యే దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలు ఆపేసి ఎమ్మెల్యే దౌర్జన్యం

Nov 6 2026 2:44 AM | Updated on Nov 6 2026 2:44 AM

సీసీ కెమెరాలు ఆపేసి ఎమ్మెల్యే దౌర్జన్యం ● పోలింగ్‌ స్టేషన్‌లో ఏజెంట్లపై బూతుపురాణం, దాడి ● భయభ్రాంతులకు గురైన ఓటర్లు ● పీఓకు ఫిర్యాదు

● పోలింగ్‌ స్టేషన్‌లో ఏజెంట్లపై బూతుపురాణం, దాడి ● భయభ్రాంతులకు గురైన ఓటర్లు ● పీఓకు ఫిర్యాదు

వీరఘట్టం: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గురువారం వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి పోలింగ్‌ కేంద్రం వద్ద ఓ వీధి రౌడీలా వ్యవహరించారు. పోలింగ్‌ స్టేషన్‌ 39లో ఏజెంట్లుగా ఉన్న గొల్ల రమేష్‌, పక్కి కిరణ్‌కుమార్‌, గేదెల సుదర్శనరావును దూషిస్తూ దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే తీరును చూసిన ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి తొలుత సీసీ కెమెరాలు ఆపేసి, తమను చంపేస్తామని బెదిరిస్తూ, దాడిచేశారని పీఓకు ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జంపు కన్నతల్లి ఎమ్మెల్యే ప్రవర్తన చూసి విస్తుపోయారు. ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హులని, చర్యలు తీసుకోవాలంటూ పీఓకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement