పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, జంఝావతి సాధన సమితి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాజెక్టు అధికారులు స్పందించారు. పార్వతీపురంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి గురువారం ప్రాజెక్టు అధికారి, ప్రాజెక్టు పరిస్థితిపై వివరణ లేఖను సమితి ప్రతినిధులకు అందజేశారు. 1976లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా 75 గ్రామాల పరిధిలోని 24,440 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని, ఆంధ్ర–ఒడిశా అంతర్రాష్ట్ర వివాదాలు, నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అధికారుల లేఖపై జంఝావతి సాధన సమితి కన్వీనర్ మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు స్పందిస్తూ.. తమ 44 రోజుల నిరవధిక దీక్ష ఫలితంగానే అధికారుల నుంచి స్పందన లభించిందన్నారు. అడ్డంకులు తొలగించి పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధుల కేటాయింపుతో పా టు స్పష్టమైన టైమ్‌టేబుల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదలై, పనులు ప్రారంభమ య్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.


