ఉధృతంగా నదుల ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

ఉధృతంగా నదుల ప్రవాహం

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

ఉధృతంగా నదుల ప్రవాహం ● నూకలవాడ, వంతరాం, నారాయణపురం గ్రామాల్లోకి నీరు ● అవస్థలు పడుతున్న ప్రజలు

● నూకలవాడ, వంతరాం, నారాయణపురం గ్రామాల్లోకి నీరు ● అవస్థలు పడుతున్న ప్రజలు

బలిజిపేట: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సువర్ణముఖి, వేగావతి నదుల ఉధృతి పెరిగి నదిపరీ వాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా వేగావతి నది ప్రవాహ ఉధృతి పెరగడంతో నూకలవాడ ఎస్సీకాలనీలోని నివాసగృహాల్లోకి నీరుచేరడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. బుధవారం రాత్రి నుంచి కాలనీలోకి నీరు రావడంతో కాలనీవాసులకు నిద్ర, ఆహారం కరువైనట్లు చెబుతున్నారు. వరద నీటికి ఎటువంటి విషసర్పాలు వస్తాయేమోనని ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు. పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేసినా అక్కడికి తరలించలేదని, ఆకలితో అవస్థలు పడ్డామని కాలనీవాసులు వాపోయారు. వంతరాం వద్ద బస్టాండ్‌ నుంచి శివాలయం వరకు వేగావతి నది నీరు రావడంతో గ్రామంలోకి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామం శివారున ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ ఉన్నాయి. ఉన్నత పాఠశాలకువచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవస్థలు తప్పలేదని గ్రామస్తులు తెలిపారు. నారాయణపురం వద్ద సువర్ణముఖి నది ఉధృతి పెరగడంతో గ్రామంలోని మహంతి వీధిలోకి నీరు వచ్చిందని ప్రజలు తెలి పారు. తీవ్రంగా వర్షాలు కురిసినప్పుడు, తుఫాన్‌ల సమయంలో నదిపరీవాహక గ్రామాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు తెలిపారు. అధికారులు వస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, వెళ్లిపోతున్నారు తప్ప పరిష్కార మార్గాన్ని చూపించడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement