తుఫాన్‌ పంట నష్టాలు రైతులే నమోదు చేసుకోవచ్చు | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ పంట నష్టాలు రైతులే నమోదు చేసుకోవచ్చు

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

తుఫాన్‌ పంట నష్టాలు రైతులే నమోదు చేసుకోవచ్చు ● కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి సమస్యాత్మక వార్డుల్లో కవాతు ● ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసుల చర్యలు షోకాజ్‌ నోటీసులు

పార్వతీపురం: అర్నబ్‌ తుఫాన్‌ వల్ల వచ్చిన భారీ వర్షాల కారణంగా పంట నష్టాలకు గురైన రైతులు తమ నష్టాల వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించిందని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. రైతులు కర్షక్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లేదా ఏపీఐఎంఎస్‌ ఫార్మర్‌ యాప్‌ ద్వారా ఆధార్‌ ఓటీపీ ధ్రువీకరణతో పంటనష్టాల వివరాలను నమోదు చేసుకోవచ్చునన్నారు. నష్టపోయిన పొలాల సర్వే నంబర్లు, భూమి వివరాలతో పాటు పంట నష్టం ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సాధారణంగా వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాల ను అంచనా వేస్తారని, రైతుల స్వీయ నమోదు వివరాలు ఈ ప్రక్రియకు అదనపు సమాచారంగా ఉపయోగడపతాయని కలెక్టర్‌ పేర్కొన్నా రు. రైతులకు ఈ విధానంపై అవగాహన కల్పి ంచి అవసరమైన సహకారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం రూరల్‌: పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన వార్డుల్లో గురువారం భద్రతా బలగాలు రూట్‌ మా ర్చ్‌ నిర్వహించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పోలింగ్‌ ప్రశాంతంగా సాగేలా డీఎస్పీ శేషయ్య ఆధ్వర్యంలో పోలీసులు కవాతు చేస్తూ పరిస్థితులను పర్యవేక్షించా రు. ముందస్తు శాంతిభద్రతల చర్యల్లో భాగంగా స్థానిక రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో సాధారణ ప్రజలకే ప్రాధాన్యం ఉంటుంద ని, రౌడీషీటర్లు మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చైతన్యం కల్పించేందుకే ఈ రూట్‌ మార్చ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కవాతులో పట్టణ సీఐ బి.వెంకట్రావు, ఎస్సైలు గోవింద, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల రెండువితల శిక్షణకు సహేతుకమైన కారణం లేకుండా గైర్హాజరైన ఏడుగురు సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి గురువారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వారిని ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement