సాక్షి, పార్వతీపురం మన్యం: వచ్చేనెల 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. దీనిప్రకారం ఈ రోజు 5 గంటల తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మైకులు, బహిరంగ సభలు, ర్యాలీ లు, ఊరేగింపులు, ఇతర ప్రచార కార్యక్రమాల కు అనుమతి ఉండదు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఇది అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నిక ల అధికారి ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. ఎ న్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మడ్డువలసకు వరదపోటు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు గురువారం వరద తాకిడి పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 63.59 మీటర్లు నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద ఎమినిది గేట్లు ఎత్తివేసి 60వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు డీఈ పి.అర్జున్ తెలిపారు. ఇప్పటికే కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామా ల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.
కులం, మతం పేరుతో ఓట్లు అడగడం.. దేవాలయాలు, చర్చిలు, మసీదుల స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్వతీపురం పట్టణంలో టీడీపీ నాయకులు, అభ్యర్థులతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలోని 29, 24, 23, 22, 15వ వార్డుల్లో పర్యటిస్తూ.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లోనూ, దేవాలయంలో జరిగిన పూజల్లోనూ తన అనుచరుల తో కలిసి పాల్గొనడం, మాట్లాడటం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం


