టీడీపీకి భారీ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాక్‌

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

● వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు

గజపతినగరం రూరల్‌: మండలంలోని అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. కాలంరాజుపేట ఎంపీటీసీ సెగ్మెంట్‌ పరిధిలోగల కాలంరాజుపేట, డోలపాలెం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో సోమవారం చేరాయి. డోలపాలెం గ్రామ టీడీపీ నాయకులు సుంకరి అప్పలనాయుడు, గంట్యాడ నాగరాజు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసుకున్నాయి. అలాగే కాలం రాజుపేట గ్రామంలో మాజీ ఉపసర్పంచ్‌ గేదెల సత్తిబాబు, లెంక కూర్మారావు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైఎసా్‌స్‌ర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ బొబ్బిలి నియోజక వర్గ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య విజయనగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా అధికార టీడీపీ నుంచి వైఎసా్‌స్‌ర్‌సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు విసుగుచెంది టీడీపీని చాలామంది నాయకులు వీడుతున్నారన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అందుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థిని గేదెల రమాదేవి, మాజీ ఎంపీటీసీ గేదెల జగదీష్‌, మాజీ సర్పంచ్‌ గేదెల ఈశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కూటమి పాలనకు విసుగు చెంది..

గుర్ల: కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావంచన పాలనకు విసుగు చెందిన 10 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో సోమవారం చేరాయి. మండలంలోని దమరసింగికి చెందిన రెడ్డి శ్రీరామ్‌, రెడ్డి శ్రీను, రెడ్డి సాయి, రెడ్డి అచ్యుతమ్మ, రెడ్డి కృష్ణవేణి తో పాటు మరో ఐదు కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరా యి. వారికి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, జెడ్పీటీసీ అభ్యర్థి సంగంరెడ్డి వెంకటలక్ష్మి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సోమవారం పార్టీలోకి ఆహ్వనించారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు

మెంటాడ: మండలంలోని ఇద్దనవలస ఎంపీటీసీ స్థానం పరిధిలో గల రాబంద గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు కూనిశెట్టి రామారావుతో పాటు 10కుటుంబాల వారు జనసేన పార్టీని వీడి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారంతా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు, మాజీ వైస్‌ ఎంపీపీ సారిక ఈశ్వరరావుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో కొంపంగి, మీసాలపేట, రాబంద మాజీ సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement