రామనారాయణంలో జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

రామనారాయణంలో జాతీయ సదస్సు

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

విజయనగరం రూరల్‌: వాల్మీకి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం శివారు ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో సోమవారం జాతీయ సదస్సు నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచిన మహోన్నత ఇతిహాసం రామాయణం. వేల సంవత్సరాలుగా భారతీయ సమాజానికి జీవన మార్గదర్శకంగా నిలుస్తున్న రామాయణాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రం, భౌగోళిక పరిశోధనలు, పరిపాలనా విధానాలు, ప్రజా విధానాల కోణంలో అధ్యయనం చేయాలనే లక్ష్యంతో విజయనగరంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణంలో జాతీయ సదస్సు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని తిరుపతి ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ ప్రాంతీయ కేంద్రం, విజయనగరం రామనారాయణంలోని వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ రామాయణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ‘ఫ్రమ్‌ ఎపిక్‌ టు ఎవిడెన్స్‌’ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సులో రామాయణాన్ని కేవలం ఆధ్యాత్మిక గ్రంథంగానే కాకుండా వివిధ పరిశోధనా కోణాల్లో అధ్యయనం చేయడంపై దృష్టి సారించారు. ఈ సదస్సులో ఎన్‌సీఎస్‌ ట్రస్ట్‌ సభ్యులు నారాయణం శ్రీనివాస్‌ , నీరజవల్లి దంపతులు, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ తిరుపతి ప్రాంతీయ కేంద్రం రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాఘవన్‌, ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌, డాక్టర్‌ శ్రీరామ చక్రధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement