పోలీస్‌ బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలన

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

విజయనగరం టౌన్‌: జాతర సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. అనుమానం వచ్చిన ప్రతి అంశాన్ని విడిచిపెట్టకుండా అధికారులు తనిఖీ చేశారు. ఆలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ బాంబ్‌ స్క్వాడ్‌ పరిశీలించింది. ఇటు రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడి, మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడి ఆవరణలో స్పెషల్‌ డిటెక్టర్‌లను ఏర్పాటుచేశారు.

గంజాయి కేసులో మరో

నిందితుడిపై పీడీ యాక్ట్‌

విజయనగరం టౌన్‌: రాజాం మండలం ఒమ్మి గ్రామానికి చెందిన లోపింటి నాగరాజు అనే 20 ఏళ్ల గంజాయి నిందితుడు తరచూ గంజాయి అక్రమ రవాణా చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పీడీయాక్ట్‌ అమలుచేసి సోమవారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్పీ ఏఆర్‌. దామోదర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లోపింటి నాగరాజుపై ఇప్పటికే జిల్లాలోని తెర్లాం, బుదరాయవలస పోలీస్టస్టేషన్‌ల పరిధిలో రెండు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. జిలాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పదే పదే నేరాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నేరాల నియంత్రణ, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా లోపింటి నాగరాజును చీపురుపల్లి సీఐ జి.శంకరరావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఏడాది వరకూ బెయిల్‌ రాకుండా చర్యలు చేపట్టి, విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement