ఎన్నికల సిబ్బందికి 28న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బందికి 28న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

ఎన్నికల సిబ్బందికి 28న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు

విజయనగరం అర్బన్‌:

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ఓటును హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 28న ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నవంబరు 1న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం తన చాంబర్‌లో మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ రోజున అత్యవసర విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది, ప్రిసైడింగ్‌ అధికారులు, రూట్‌ అధికారులు, వాహన డ్రైవర్లు ఫెసిలిటేషన్‌ కేంద్రాల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థతోపాటు నెల్లిమర్ల, బొబ్బిలి మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో గెజిటెడ్‌ అధికారులను అందుబాటులో ఉంచాలని, సంబంధిత పత్రాలపై సంతకాలు, ధ్రువీకరణ ప్రక్రియను అక్కడికక్కడే వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల వివరాలను వెంటనే ప్రకటించాలని సూచించారు.

25న అభ్యర్ధుల తుది జాబితా

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25న ప్రచురించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు వేసేలా 28న ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు, పోలైన ఓట్లను భద్రపరిచేందుకు పటిష్టమైన స్ట్రాంగ్‌ రూమ్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్ల నిర్వహణపై సమీక్షించి పలుసూచనలు చేశారు. రాజాం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.

విధుల నుంచి మినహాయింపు లేదు

స్థానిక సంస్థల ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందిలో ఎవరికీ మినహాయింపు ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. విధులకు సంబంధించి జారీ చేసిన ఆదేశాలను పాటించని వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమాలకు సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావలని, పోలింగ్‌ సిబ్బందికి వివిధ దశల్లో నిర్వహించాల్సిన శిక్షణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు, డీఈఓ మాణిక్యంనాయుడు, మున్సిపల్‌ కమిషనర్లు బాలస్వామి, రామలక్ష్మి, గోవిందరావు, రామచంద్రరావు, ఎన్నికల సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement