టీడీపీ నాయకురాలు శ్రీదేవి భర్త పేరిట 16 సెంట్లు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకురాలు శ్రీదేవి భర్త పేరిట 16 సెంట్లు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

దేవుడి మాన్యం అధికార తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి భర్త గంటేడ సూర్యారావు పేరిట 16 సెంట్లు నమోదై ఉండడం అనేక ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్‌సీఏ రికార్డుల్లో శ్రీరామ అష్ట శివ కేశవులు పేరిట ఉన్నట్లు చెబుతున్న భూమి ఇతరుల పేర్లకు ఎలా మారిందన్నది తేలాల్సిఉంది. గజపతినగరం నుంచి ఎంపీపీ రేసులో ఉన్న శ్రీదేవి ప్రస్తుతం మరుపల్లి నుంచి ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు. కాలం కలిసొస్తే ఆవిడను ఎలాగైనా ఎంపీపీ కుర్చీలో కూకోబెట్టేయాలని పార్టీ పెద్దలు కూడా గట్టిగా కమిటై ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ 16 సెంట్ల భూమి అంటే దాదాపు 800 గజాల వాణిజ్య పరమైన భూమి దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఆంచనా. మొత్తానికి అధికారం మాటున నాయకులంతా కలిపి దేవుడికి పంగనామాలు పెట్టారని ప్రజలు గుసగుసలాడుతున్నా బయటకు ఏమీ అనలేని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement