స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ● ఎన్నికల కమిషన్‌ సమీక్షలో పాల్గొన్న ఎస్పీ మాధవ్‌రెడ్డి మహిషాసుర మర్థినిగా కోటదుర్గమ్మ

పార్వతీపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం సమీక్షించా రు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. కలెక్టర్లు, పోలీస్‌, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే తక్షణమే నివేది కలు పంపాలని, అవి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. వ్యయ పరిశీలకులు నిరంతరం అందుబాటులో ఉండి అభ్యర్థులకు ఖర్చుల నియమాలను వివరించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీటీవీ కవరేజీ, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేయాలని, పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం ఐజీ రాజకుమారి మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బెదిరింపులకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్య లు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘానికి వచ్చే ఫిర్యాదులపై ఎస్పీలు, కలెక్టర్లు తక్షణమే స్పందించి నివేదికలు సమర్పించాలని అధికా రులను ఆదేశించారు.

పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారు సోమవారం మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖపట్నం జిల్లా జడ్జి యు.సత్యారావు కోటదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయం ఆవరణలో అర్చకులు సామూహిక కుంకుమ పూజలు జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement