ఈ–ఆఫీస్‌ అమలులో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఈ–ఆఫీస్‌ అమలులో అలసత్వం వద్దు

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

పార్వతీపురం: జిల్లాలో ఈ–ఆఫీస్‌ విధానాన్ని 100 శాతం అమలు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పలుశాఖల్లో గత మూడు నెలలుగా జీరో ఫైల్స్‌ నమోదుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సమావేశానికి పోలీస్‌ శాఖ ప్రతినిధులు హాజరుకాకపోవడంపై స్పందిస్తూ, ఈ అంశంపై ఎస్పీకి లేఖ రాయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement