గురజాడ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

గురజాడ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

పార్వతీపురం: సామాజిక మార్పునకు గురజాడ వెంకట అప్పారావు రచనలు పునాదిగా నిలిచాయని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో గురజాడ 164వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాల నిర్మూలనకు గురజాడ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు, సామాజిక సందేశాలను భావితరాలకు చేరేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్వో కె.హేలమలత, ఆర్డీఓ మాధురి, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, డీఈఓ పి.బ్రహ్మజీరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement