పార్వతీపురం రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో అడుగులేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురంలో మాజీ శాసనసభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, అలాగే జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు సభ్యులు హాజరయ్యారు.సభలో నాయకులు మాట్లాడు తూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరి గిన సంక్షేమ కార్యక్రమాలను, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ పాలన తీరును గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని కేడర్‌కు సూచించారు. వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జీ, బల గ రేవతమ్మ, ఎంపీపీలు బలగ రమణమ్మ, మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్, వెలిది సాయిరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, మాజీ వైస్ చైర్‌పర్సన్ కొండపల్లి రుక్మిణి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వివి ధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు మూడు మండలాల్లోని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను కచ్చితంగా కై వసం చేసుకుంటాం. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్య త నాది. నేను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ ప్రస్థా నం ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే నడుస్తాను. గ్రామ, మండల స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి రెండు ప్రభుత్వాల పాలనల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తాం.
–అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే
పార్టీకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఉమ్మడి జి ల్లా రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా పార్వతీపురం నియోజకవర్గం పార్టీకి కంచుకో టగా నిలుస్తుంది. రానున్న మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క రూ సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీని విజయపథంలో నడపాలి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీని తిరిగి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కేడర్ అంతా సన్నద్ధం కావాలి.
–శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
సమష్టి కృషితో విజయబావుటా
ఎగురవేయాలి
అన్ని స్థానాల్లో పోటీకి పార్టీ సిద్ధం
పార్టీ శ్రేణులకు రీజినల్ కోఆర్డినేటర్ ముత్యాలనాయుడు దిశానిర్దేశం


