చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. మొన్నటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు అర్హుల నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. 50 ఏళ్లు వయస్సు దాటినవారందరికీ పింఛన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని విస్మరించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటిరి మహిళలు, కళాకారులు, తదితర వర్గాల వారు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సచివాలయాలు, ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, సర్వర్ డౌన్, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు పట్టుకుని సచివాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి విజయనగరం రింగ్‌రోడ్డులోని బొందిలిగూడెం సచివాలయంలో మంగళవారం కనిపించిన చిత్రాలే సజీవ సాక్ష్యం.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


