● జాతీయ స్థాయి పోటీలకు మోడల్ విద్యార్థి ప్రయోగం
● ఇన్‌స్పైర్ మానక్‌లో రాష్ట స్థాయి పోటీల్లో ఎంపిక
భామిని: నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్‌స్పైర్ మనక్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కొప్పర తాన్వీర్‌కుమార్ రూపొందించిన ‘స్మార్ట్ రైల్వే ఎమర్జెన్సీ ఎగ్జిట్’ ప్రయోగానికి గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికై ంది. గైడ్ టీచర్ సీహెచ్ సంతోష్‌కుమార్ పర్యవేక్షణలో అత్యవసర పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఉపయోగపడేలా స్మార్ట్ రైల్వే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ప్రాజెక్టును తాన్వీర్‌కుమార్ ప్రదర్శించనున్నారు. విద్యార్థిని ప్రిన్స్‌పాల్ జి.బాబూరావు, సిబ్బంది, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు అభినందించారు.


